టీడీపీతోనే తెలంగాణ అభివృద్ధి : బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలోనే మధిర నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. ఖమ్మం జిల్లాలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాయపట్నం, దెందకూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాలను బాలయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, కాళోజీ లాంటి గొప్ప నేతలు తెలంగాణలో జన్మించారని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం గొప్పందని ప్రశంసించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు టీడీపీ పని చేస్తుందని సృష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు రమణ, పోలిట్బ్యూరో సభ్యులు నామా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు తుళ్లూరు బ్రహ్మయ్య, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.













