అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు
కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన 1,60,083 మందికి వేతనాలు వేయలేదా? అని ప్రశ్నించారు. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఐటీ రంగంలో గత 60 ఏళ్లలో 3.23 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే, కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో 10 లక్షకు పైగా ఇచ్చింది. పరిశ్రమలకు ఒక సెకను అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసింది వాస్తవ కాదా? అని ప్రశ్నించారు. మాణికం ఠాగూర్ గురించి తాము కొత్తగా ఏమీ చెప్పలేదు. ఆ పార్టీ చెందిన కోమటిరెడ్డి సోదరులు అన్న మాటలనే ప్రస్తావించాం అని తెలిపారు.













