ఎంపీగా ఉన్న వ్యక్తికి కేంద్ర, రాష్ట్ర సంబంధాలు తెలియవా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, ప్రాజెక్టులపై ప్రధాని, కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలిశారన్నారు. కనీస అవగాహన లేకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శిస్తున్నారన్నారు. ఎంపీగా ఉన్న వ్యక్తికి కేంద్ర, రాష్ట్ర సంబంధాలు తెలియవా? అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై బండి సంజయ్ అవగాహన పెంచుకోవాలన్నారు. సంజయ్ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని బాల్కా సుమన్ పేర్కొన్నారు.













