ఏపీకి ఇస్తే మాకు ఇవ్వాల్సిందే : కడియం
రాష్ట్రంలో కొత్త విద్యా సంస్థల ఏర్పాటుపై కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించిన లాభం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ను కలిసిన ఆయన విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. కరీంనగర్లో ట్రిపుల్ ఐటీతో సహా పలు విద్యా సంస్థలపై త్వరితగతిన చర్చలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తమ వినతులకు జావడేకర్ సానుకూలంగా స్పందించారని కడియం చెప్పారు. పన్ను రాయితీల అంశంపై ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకూ ఇవ్వాల్సిందేనన్నారు. ఏపీలో ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో చిత్త శుద్ధిలేదని విమర్శించారు.













