పాండవుల గుట్టలో రోప్వే, స్లైక్లింగ్ సౌకర్యాలు

అమెరికా, దుబాయ్, సింగపూర్లాంటి దేశాలకు దీటుగా రాష్ట్రంలో టూరిజం స్పాట్లు ఉన్నాయని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలను మంత్రి సీతక్క తో కలిసి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. తిరుమలగిరి శివారులోని బుగులోని, పాండవుల గుట్టలను, రామప్ప టెంపుల్, లక్నవరం సరస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నో అందమైన పర్యాటక ప్రాంతాలున్నాయని, వాటిని డెవలప్ చేసి విదేశాల నుంచి కూడా పర్యాటకులు వచ్చేలా చేస్తామన్నారు. పాండవులగుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. పాండవుల గుట్టలో రోప్వేతో పాటు క్యాంటీన్ల నిర్మాణం, సైక్లింగ్ లాంటి వసతులు కల్పిస్తామన్నారు.