మీ ప్రాంతంలో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి?
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు రాష్ట్ర సరిహద్దు కర్ణాటకలోని ఓ గ్రామస్థులతో ముచ్చటించారు. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండంలోని ఖరసగుత్తిలో గిరిజన పాఠశాల ప్రారంభోత్సవానికి వెళ్తున్న ఆయన మార్గమద్యంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన జమిలి గ్రామస్థులు నీళ్ల బిందెలు పట్టుకొని పొలాల వద్దకు వస్తుండటంతో.. వాహనం దిగి వారి వద్దకు వెళ్లారు. మీ ప్రాంతంలో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? పెన్షన్, రేషన్ సరుకులు సమయానికి అందుతున్నాయా? ఆడ పిల్లల వివాహానికి ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సాయం వంటి తదితర వివరాలను వాకబు చేశారు. అక్కడి స్థానికులు స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు బాగున్నాయంటూ వారి సమస్యలను విన్నవించారు.













