ఏపీ నేతలకు మంత్రి హరీశ్ రావు చురకలు
తన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు రాద్దాంతం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఫైరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పలువురికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయని, అలా ఉంటే ఇక్కడే ఓటు ఉంచుకోవాలని చెప్పానన్నారు. తెలంగాణలో ఏముందో ఇక్కడికి వచ్చి చూస్తే వారికి అర్థమవుతుందన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ పాల్గొన్నారు. ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడట్లేదని హరీశ్ చురకలంటించారు.













