తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ఈ ఖాళీ ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల చేసింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు జాబితా షెడ్యూల్ను శుక్రవారం నాడు ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇటీవల ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రెడీ అవుతోంది. ఈ స్థానాలకు ఫిబ్రవరి 24న ముసాయిదా జాబితాను ప్రకటిస్తుంది. మార్చి 14వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఏప్రిల్ 4వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఈ క్రమంలోనే పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం కోరింది.













