కరోనా తర్వాత… ఈ రెండు రంగాల్లో అవకాశాలు
ప్రస్తుతం నెలకొన్న సంక్షోభవంలో ఫార్మా, లైఫ్ సైన్స్ రంగానికి అనేక అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన వెబినార్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. కరోనాతో నెలకొన్న సంక్షోభం తర్వాత కూడా ఈ రెండు రంగాల్లో అద్భుతమైన అవకాశాలు ఉంటాయన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. జీనోమ్ వ్యాలీ, వైద్య పరికరాల పార్క్, హైదరాబాద్ ఫార్మా సిటీ వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడులకు గమ్య స్థానంగా నిలువబోతోందన్నారు. ప్రస్తుతం కరోనా సంబంధిత మందులు, వ్యాక్సిన్లు తయారీలో హైదరాబాద్ తన ప్రాధాన్యతను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిందని పేర్కొన్నారు.













