ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తాం : కేటీఆర్
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తాజా ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలతోపాటు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్నారు. ఓటమి పాలైన నియోజకవర్గాల్లోని పరిస్థితులపై సమీక్షించారు. దీంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బీఆర్ఎస్ గౌరవప్రదమైన స్థానాలను సాధించిందని, ప్రతిపక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు.













