సిరిసిల్ల వాసుల విడుదలకు మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు
దుబాయ్‌లో 15 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురిని విడిపించేందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు కొనసాగించారు. అమెరికా నుంచి తిరిగి వస్తూ దుబాయ్‌లో ఆగిన కేటీఆర్ మరోసారి ఖైదీల విడుదలకు ప్రయత్నం చేశారు. దుబాయ్ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఖైదీల తరపున వాదిస్తున్న అరబ్ లాయర్‌తో, దుబాయ్‌లో భారత కౌన్సిల్ జనరల్ కార్యాలయ అధికారులతోనూ మాట్లాడారు. సిరిసిల్లకు చెందిన రవి, మల్లేశ్, నాంపల్లి, లక్ష్మణ్, హన్మంతు నేపాల్‌కు చెందిన ఓ సెక్యూరిటీ గార్డు హత్య కేసులో 15 ఏళ్లుగా దుబాయ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా గత నెల 19న విదేశీ పర్యటన వెళ్లి మంత్రి కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు.













