రెండేళ్లలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే : కేటీఆర్
బీఆర్ఎస్ కు అధికారం మాత్రమే పోయిందని, పార్టీ పట్ల ప్రజలకు ఉన్న ప్రేమ ఇంకా తగ్గలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. శంషాబాద్ (Shamshabad)లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ (Congress) పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. మÖడేళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్లో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. శాంతిభద్రతలు సైతం సరిగా లేవని, పోలీసులు కూడా కాంగ్రెస్ నేతల మాటలే వింటున్నారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలు (Industrialists) చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రెండేళ్లలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే (BRS Government) వస్తుందన్నారు.








