బొత్స సత్యనారాయణకు భారీ షాక్
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) సొంత నియోజకవర్గం చీపురుపల్లి (Cheepurupalli)లో ఆ పార్టీకి మరోసారి భారీ షాక్ తగిలింది. మెరకముడిదాం మండలంలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ మండల అధ్యక్షుడు కోట్ల వెంకట్రావుతో పాటు 13 గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ (MPTC)లు, ఇతర నాయకులు ఆ పార్టీ వీడారు. తమ రాజీనామా పత్రాలను వైసీపీ అధ్యక్షుడు జగన్కు పంపుతున్నట్లు పేర్కొన్నారు. వీరంతా త్వరలో టీడీపీలో చేరనున్నారు.








