దేశం మొత్తం దీనిపైనే చర్చ …..రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్కు దుమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. మునుగోడులో పోటీకి కేసీఆర్ వస్తారా? కేటీఆర్ వస్తారా? సిద్ధిపేట రోడ్లు, మునుగోడు రోడ్లకు తేడా చూడండి. కేసీఆర్ మీరు రాష్ట్ర ప్రజల సొత్తు రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. వచ్చే బతుకమ్మ నాటికి కవిత తీహార్ జైలుకు వెళ్తారు. ప్రజలందరికి దృష్టి మునుగోడు ఉప ఎన్నికపైనే ఉంది. దేశం మొత్తం దీనిపై చర్చించుకుంటోంది అని అన్నారు.













