తెలంగాణ అసెంబ్లీ రద్దు
తెలంగాణ తొలి అసెంబ్లీ రద్దయింది. అసెంబ్లీ రద్దుకు సంబంధించిన ఏకవాక్య తీర్మానాన్ని సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టగా, మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. కేబినెట్ ఆమోదించిన అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్కు సమర్పించారు. ఈ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్ను గవర్నర్ కోరారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేసీఆర్ అంగీకరించారు. జూన్ 2, 2014న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 4 సంవత్సరాల 3 నెలల 4 రోజులు పాటు తెలంగాణ తొలి ప్రభుత్వం కొనసాగింది.













