మా వంశస్థుల గడ్డకు రావడం.. సంతోషంగా ఉంది
కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు తెలంగాణ ప్రభుత్వం వారం రోజుల పాటు కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహిస్తున్నది. ఏడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను కాకతీయుల 22వ తరం వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భద్రకాళి ఆలయ స్వాగత ద్వారం వద్ద ఆయనకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ ఉత్సవాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమల్‌చంద్ర భంజ్‌దేవ్ మీడియాతో మాట్లాడుతూ మా వంశస్థుల గడ్డకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. బస్తర్‌లో తమ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. కాకతీయ ఉత్సవాలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. తనను ఆహ్వానించిన నాయకులకు కమల్ చంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.













