బీఆర్ఎస్ హయాంలోనే విచ్చలవిడిగా అమ్మకాలు : మంత్రి జూపల్లి
విమర్శలు చేసే ముందు వాస్తవం తెలుసుకునే ఓపిక హరీశ్‌రావు (Harish Rao)కు ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. ఇటీవల హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. శ్రీశైలం(Srisailam) నీటిని బీర్ల (Beers) ఉత్పత్తికి వినియోగిస్తామని నేను ఎక్కడా చెప్పలేదు. డిండి ప్రాజెక్టులోకి శ్రీశైల బ్యాక్ వాటర్ తీసుకుంటే ప్రయోజనమనే చెప్పాను. ఎల్‌నినోను, మద్యం అమ్మకాలను ముడిపెట్టి రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉంది. బీఆర్ఎస్ (BRS) హయాంలోనే విచ్చలవిడిగా అమ్మకాలు జరిగాయి. వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శించడం సరికాదు. మద్యం విక్రమాలతో ఖజానా నింపుకొంది మీరా? మేమా? నేను లెక్కలతో సహా చెబుతున్నా సమాధానం చెబుతారా? అని ప్రశ్నించారు.








