Jaggareddy: ఇరు రాష్ట్రాల సమస్యలపై ఉన్నత స్థాయిలో చర్చ : జగ్గారెడ్డి
మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ (YS Jagan), కేసీఆర్పై తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) సెటైర్లు విసిరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై ఉన్నత స్థాయిలో చర్చ జరగాలన్నారు. నీటి ప్రాజెక్టులు, కేటాయింపులపై ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడుకుంటారని తెలిపారు. గతంలో కేసీఆర్, జగన్ ఇంటికి వచ్చి చేపలు తిన్నారని, జగన్ హైదరాబాద్లో కేసీఆర్ (KCR)ఇంటికి వచ్చి కోడి కూర తిన్నారంటూ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అంత దిగజారి వ్యవహరించరని స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా సీఎంలు, ఆశాఖ మంత్రులు చర్చించాల్సిన అంశాలపై తానేమీ మాట్లాడనని తెలిపారు. గతంలో జగన్, కేసీఆర్లు వీటిపై ఎప్పుడైనా చర్చలు చేశారా అని ప్రశ్నించారు. మీడియా వాళ్లు వారిని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, ఇరు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనేదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు.






