తెలంగాణలో వాటర్ డ్రోమ్స్ ఏర్పాటు చేస్తాం : కేంద్ర మంత్రి
తెలంగాణలో ఎయిర్పోర్టులు, వాటర్ డ్రోమ్స్,హెలిప్యాడ్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. బేగంపేటలో నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియూ ఏవియేషన్ సదస్సు రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా విమానయాన రంగం ఒడిదొడుకులను ఎదుర్కొంటోందని అన్నారు. ఒడిదొడుకుల నుంచి విమానయాన రంగం వేగంగా పుంజుకుంటోందని చెప్పారు. గత ఏడేళ్లలో విమానాశ్రయాల సంఖ్య భారీగా పెరిగిందని, 66 విమానాశ్రయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలో ప్రస్తుతం విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 140కి చేరిందన్నారు. గుజరాత్లో హెలిప్యాడ్లు, ఎయిర్డ్రోమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. 2024-25 నాటికి ఎయిర్పోర్టుల సంఖ్యను 140 నుంచి 220కి పెంచుతామని తెలిపారు. విమానాశ్రయాల నిర్మాణం ఆర్థికవృద్ధి నడవాకు కీలమని తెలిపారు.













