ప్రధాని మోదీకి ఆయనంటే.. ఎందుకంత భయం?
చైనా జిన్జియాంగ్ రాష్ట్రంలో ఉయ్ఘర్లపై జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ ముందుకు ముసాయిదా తీర్మానం వచ్చింది. అయితే దీనిపై చర్చకు జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. పలు ఇతర దేశాలు కూడా ఓటింగ్‌లో పాల్గొనకపోవడంతో ఇది చైనాకు అనుకూలంగా మారింది. తీర్మానం వీడిపోయింది. ఫలితంగా చైనాకు మరోసారి తిరుగులేకుండా పోయింది. ఈ విషయంపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అంటే ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. ఆయనతో 18 సార్లు భేటీ అయినా, ఏది కరెక్ట్, ఏది తప్పో చెప్పే దైర్యం లేదా అని నిలదీశారు. ఐరాస ఓటింగ్‌లో భారత్ దూరంగా ఉండి చైనాకు ఎందుకు అనుకూలంగా వ్యవహరించిందో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు.













