ఈ నెల 10న అమెరికాకు హైదరాబాద్ కలెక్టర్
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు స్టడీ టూర్ కోసం ఈనెల 10న అమెరికా వెళ్లనున్నారు. 2002 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రఘునందన్‌రావు 2018 ఆగస్టు 28న హైదరాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా దాదాపు 3 సంవత్సరాలు పని చేసిన ఆయన హైదరాబాద్ కలెక్టర్‌గా గతేడాది సెప్టెంబర్ 4న బాధ్యతలు చేపట్టారు. దాదాపు నాలుగు నెలల పాటు కలెక్టర్‌గా పని చేసిన రఘునందన్‌రావు అమెరికాలోని కాలిఫోర్నియాలోని బెర్కులీ యూనివర్సిటీలో ఉన్నత చదువుల కోసం ఆన్ డ్యూటీలో స్టడీ టూర్‌కు వెళ్తున్నారు. కలెక్టర్ రఘునందన్‌రావు స్టడీ టూర్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించగా అమెరికా ప్రభుత్వం వీసా కూడా మంజూరు చేసింది. రఘునందన్‌రావు ఈ నెల 10న అమెరికాకు వెళ్లనున్నారు. కలెక్టర్ స్టడీ టూర్‌కు వెళ్లనుండడంతో హైదరాబాద్ కలెక్టర్‌గా ఎవరిని నియమిస్తారో వేచి చూడాల్సిందే.













