హైదరాబాద్లో హై అలర్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జంటనగరాలలో హై అలర్ట్ ప్రకటించారు. నగరంలో అనేకచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గోల్కొండ, ఫలక్నుమా ప్యాలెస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 27 నుంచి గోల్కొండ కోటలోకి సందర్శకులకు అనుమతి లేదు. బందోబస్తులో సుమారు 2వేల మంది పోలీసులు పాల్గొనున్నారు. అమెరికా ఏజెంట్లు శాటిలైట్ నిఘా ద్వారా భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తులో నిమగ్నమై ఉన్నారు.













