వారి మద్దతు లేకుండానే రెండుసార్లు అధికారంలోకి : గుత్తా
కర్ణాటకలో వచ్చిన ఫలితాలను చూసిన తర్వాతైనా బీజేపీకి జ్ఞానోదయం కలగలేదని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో గుత్తా మీడియాతో మాట్లాడారు. దేశంలో మతకల్లోలాలు సృష్టించి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులైందని, మెజార్టీ స్థానాలు గెలుచుకున్న అంతర్గత కుమ్ములాటలతో సీఎంను కాంగ్రెస్ ఎంపిక చేసుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్‌లోనూ సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారన్నారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. వామపక్షాల మద్దతు లేకుండానే రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చామన్నారు.













