జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం .. గుడ్ న్యూస్
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 500 గజాల లోపు జీవో 59 పెండింగ్ దరఖాస్తులకు నెలలో పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. ఈ మేరకు మెమో నంబర్ 48030 పేరిట కలెక్టర్ల (Collectors)కు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవో 59 అమలులో అక్రమాలకు తావు లేదని, నిబంధనల మేరకు నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. గతంలో జీవో 59లో అక్రమాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కన్వేయన్స్ డీడ్స్ కేసులను కూడా సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఎర్రవల్లి ( Erravalli)లో సర్వే కోసం మరోసారి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అక్కడ అసైన్డ్ ల్యాండ్ (Assigned land) ఉంటే పేదలకు పంచుతామన్నారు.








