Ramachander Rao:ఎవరికీ నష్టం లేకుండా సబర్మతి పూర్తి చేశాం : రామచందర్రావు
దేశంలో గ్యాస్ (Gas) కొరత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachander Rao) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది కావాలనే కొరతను సష్టిస్తున్నారని ఆరోపించారు. యుద్ధం వల్ల అనేక దేశాల్లో గ్యాస్ ధరలు పెరిగాయి. మన దేశంలో మాత్రం పెరగలేదు. మోదీ ప్రభుత్వం (Modi Government) ఈ ధరలను నియంత్రణలో పెట్టింది. గతంలో గ్యాస్ ధర రూ.1,200 ఉంటే మోదీ ప్రభుత్వం రూ.900లకు తగ్గించింది. మూసీ పునరుజ్జీవానికి రూ.7 వేల కోట్లు అంటున్నారు. మూసీ ప్రాజెక్టుకు బీజేపీ (BJP) వ్యతిరేకం కాదు. అయితే 50 మీటర్ల బఫర్ జోన్ అనేది అవసరం లేదు. గాంధీ విగ్రహం ఏర్పాటుకు 100 ఎకరాలు కావాలా? గుజరాత్లో ఎవరికీ నష్టం లేకుండా సబర్మతి ప్రాజెక్టు పూర్తి చేశాం అని అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








