టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ పై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్‌కు అప్పగించాలని నిర్ణయించారు. దీంతో చైర్మన్, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. చైర్మన్ పదవి కోసం సుమారు 50 మంది దరఖాస్తు చేసుకోగా చివరికి మహేందర్ రెడ్డిని ప్రభుత్వం ఖరారు చేస్తూ దస్త్రాన్ని గవర్నర్‌కు పంపగా, ఆమె ఆమోదం తెలిపారు.













