గో మహాగర్జనలో ఆపశ్రుతి
హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో యుగతులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో మహాగర్జనలో అపశ్రుతి చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం జరగడంతో వేదికపై గడ్డితో అలంకరించిన గుడారాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూటే తో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో మూడు గుడారాలు కూడా కాలిపోయాయి. వేదిక వద్దకు పోలీసులు, యుగతులసి సభ్యులు, వాలంటీర్లు చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అందరూ అప్రమత్తంగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సభ ప్రారంభం కానుండగా ఈ అగ్నిప్రమాదం జరగడంతో నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.













