సీఎం కేసీఆర్‌తో అయినా.. ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో అయినా
కేంద్రం ఇచ్చే నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అయినా, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో అయినా చర్చకు సిద్ధమని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం వెలవెలబోతోందని, అందులో పాల్గొనేందుకు అధికారులు ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. సర్పంచులకు 14, 15వ ఆర్థిక సంఘం నిధులే తప్ప మిగతా నిధులు రావడం లేదని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే ఉపాధి హామీ నిధులతో మాత్రమే పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వాడుకుంటూ ఫలితం రాష్ట్ర ప్రభుత్వం పొందుతోందన్నారు.













