తాను పార్టీ మారలేదు.. వాళ్ళే వెళ్లగొట్టారు
తాను పార్టీ మారలేదని, టీఆర్ఎస్ వాళ్ళే వెళ్లగొట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ప్రధాని మోదీ 8 ఏళ్ళ ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఉద్యమం నాటి కేసీఆర్కు ఇప్పటి కేసీఆర్కు చాలా తేడా ఉందని అన్నారు. ఒకప్పుడు కేసీఆర్ టీవీలో కనబడితే యువత కేరింతలు కొట్టేవారని, ఇప్పుడు చీదరించుకుంటున్నారని అన్నారు. రెచ్చగొడితే ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానని స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలపై చర్చకు సిద్ధమని అన్నారు. కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరాలని చాలామంది ఎదురు చూస్తున్నారని అన్నారు.













