తెలంగాణలో లాక్ డౌన్ పై మంత్రి ఈటల క్లారిటీ
మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల మాదిరి తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితి లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. వరంగల్ ఎంజీఎం దవాఖానను మంత్రి ఈటల సందర్శించారు. జిల్లాలో కరోనా పరిస్థితితోపాటు వివిధ అంశాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్ ఎంజీఎంలో ప్రస్తుతం 945 మంది కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మరో 300 మంది రోగులు వచ్చినా ఇబ్బంది లేదని తెలిపారు. కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు కృషి చేయాలని వైద్యులకు సూచించారు.













