ఈ నెల 4న ఈటల రాజేందర్ రాజీనామా!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 4న టీఆర్‍ఎస్‍కు హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 8 లేదా 9న ఈటల బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‍ఛార్జి తరుణ్ ఛుగ్‍ని, కేంద్ర మంత్రి జి.కిషన్‍రెడ్డిని కలిసిన ఆయన జాతీయ నాయకత్వంతో సమావేశమయ్యారు. ఈటల, ఏనుగు రవీందర్‍రెడ్డిలు ఛుగ్, మాజీ ఎంపీ జి. వివేక్‍వెంకటస్వామితో కలిసి ఆ పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్‍తో భేటీ అయ్యారు. ముందు ఎమ్మెల్యే పదవికి, టీఆర్‍ఎస్‍కు రాజీనామా చేసి, మంచిరోజు చూసుకుని ఢిల్లీకి వచ్చి బీజేపీలో చేరతానని రాజేందర్ అన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని వ్యాఖ్యానించారు.