ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ?
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ దిశలో కీలకమైన చేరికలు, సమన్వయ కమిటీ కన్వీనర్‌గా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈటలకు కూడా సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో చేరికలు, పోలింగ్ కేంద్రాల వారిగా పార్టీని బలోపేతం చేసే బాధ్యతను ఈటల రాజేందర్‌కు అప్పగించే అవకాశాలున్నాయి. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు అన్ని రకాల అండగా నిలిచిన ఈటల కొద్ది రోజుల క్రితం గులాబీ కండువాను వదిలి కాషాయ కండువాను కప్పుకున్నారు. అయినప్పటికీ పార్టీలో చేరినప్పటి నుంచి ఈటల పని తీరు, పార్టీ పటిష్టత కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం బీజేపీలో అధికారంలోకి తీసుకు వచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఒక వ్యూహం ఉందని అగ్రనాయకత్వం అభిప్రాయడిరది. అంతేకాకుండా కేసీఆర్ ప్లస్, మైనస్లన్ని ఈటలకు తెలసునని, ఏ సమయంలో ఎక్కడ దెబ్బకొడితే కేసీఆర్ దిమ్మతిరుగుతుందన్న సంగతి ఈటల బాకు తెలుసు కాబట్టి ఆయనను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని నాయకత్వం నిర్ణయించింది.













