సుఖేశ్ తో నాకెలాంటి పరిచయం లేదు : ఎమ్మెల్సీ కవిత
ఆర్థిక మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌తో తనకెలాంటి పరిచయం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. నకిలీ చాట్లతో తనపై కావాలనే దుష్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ను నేరుగా ఎదుర్కొనే దైర్యం లేకనే తనపై ఇలా దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. ఒక ఆర్థిక నేరగాడు అనామక లేఖ రాస్తే రాద్దాంతం చేస్తున్నారు. ఆ లేఖను పట్టుకుని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ సీఈసీకి లేఖ రాశారు. బీజేపీ టూల్కిట్లో భాగమే ఈ బురదచల్లే కార్యక్రమం. వాస్తవాలు తెలుసుకోకుండా పనిగట్టుకుని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రచురించాయి. పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరం అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.













