జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ కు డిప్యూటీ సీఎం భట్టి శుభాకాంక్షలు
సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తిగా నియమితులైన తెలంగాణ హైకోర్టు (Telangana High Court) మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (Justice Aparesh Kumar Singh)ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్‌ను కలిసి శాలువ కప్పి, పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు సీజేగా ఆయన అందించిన సేవలు స్మరించుకుంటూ, సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన బాధ్యతలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.








