ఓయూని అంతర్జాతీయ స్థాయికి పెంచుతామని.. గల్లీ స్థాయికి
ఉస్మానియా యూనివర్శిటీని అంతర్జాతీయ స్థాయికి పెంచుతామని, గల్లీ స్థాయికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీది రాజకీయ విజిట్ కాదన్నారు. రాహుల్ లాంటి నేతలు ఓయూకి వెళ్తే మంచి గుర్తింపు వస్తుందన్నారు. ఓయూ వీసీలుగా గొప్ప గొప్ప వారు పనిచేశారన్నారు. ఇప్పుడున్న వీసీ విజ్ఞతతో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని ఓయూకి రావడానికి అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో కనీసం స్టాప్ నియామకం కూడా జరగడం లేదని తెలిపారు. రాహుల్ తెలంగాణలో పర్యటించడంపై టీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రావడానికి కారణం సోనియా గాంధీనేని తెలిపారు. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే పదేళ్లు కేసీఆర్ తపస్సు చేసినా రాష్ట్రం వచ్చేది కాదన్నారు. గులాబీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, వారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.













