పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు దక్కుతుందని చెప్పారు. అందుకు మహేశ్‌గౌడ్, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం రావడమే ఉదాహరణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీం అవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్ల బిల్లులు ఆపిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని ఇప్పుడు వారి తరపున పోరాడుతామని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు..













