కాగ్నిజెంట్ నూతన క్యాంపస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

15 రోజుల విదేశీ పర్యటన ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రూ.31,500 కోట్ల పెట్టుబడులు సాధించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ సంస్థ కొత్త క్యాంపస్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ రెండో రింగ్‌రోడ్డు ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు ద్వారా సెమీ అర్బన్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.