తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 2019-20 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో బడ్టెట్ ప్రవేశపెట్టడం తెలంగాణలో ఇదే తొలిసారి. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినా కారణంగా ఎన్ని నిధులు వస్తాయో సృష్టంగా తెలియదన్నారు. అందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని కేసీఆర్ సృష్టం చేశారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలోనూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెడతామని వెల్లడించారు.













