ఆర్థిక వేత్త బిపిఆర్ విఠల్ మృతిపట్ల కెసిఆర్ సంతాపం
ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ఐఎఎస్ అధికారి బిపిఆర్ విఠల్ మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. అనారోగ్య సమస్యలతో శుక్రవారం ఉదయం విఠల్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో ఆర్థిక, ప్రణాళిక కార్యదర్శి, వైఎస్ చైర్మన్ ఎపి ప్లానింగ్ డెవలప్మెంట్ బోర్డు సభ్యుడిగా, ఐఎంఎఫ్ సలహాదారుడు, పదో ఆర్థిక కమిషన్ సభ్యుడిగా సేవలందించారని గుర్తు చేశారు. సుదీర్ఘకాలం పాటు బిపిఆర్ విఠల్ అందించిన సేవలను స్మరించుకున్నారు. బిపిఆర్ విఠల్ కుటుంబ సభ్యులకు కెసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ ఆర్థికవేత్త బిపిఆర్ విఠల్ మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు వినోద్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. విఠల్ భార్య శేషు, కుమార్తె నివేదిత కుమార్, కుమారుడు సంజయ్ బారులు ఉన్నారు. సంజయ్ బారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సలహాదారుడిగా పనిచేశారు.













