చల్ లోక్‌భవన్ ఉద్రిక్తం .. పలువురు మంత్రుల అరెస్టు
సర్ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా ఇండి కూటమి ఆధ్వర్యంలో చలో లోక్‌భవన్ (Chalo Lok Bhavan) కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ (Gyanesh Kumar,) రాజీనామా చేయాలనే డిమాండ్‌తో సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ నిరసన చేపట్టారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం (Indira Gandhi Statue ) నుంచి లోక్‌భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటీ శ్రీహరి, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. భారీ ఎత్తున కాంగ్రెస్, సీపీఐ (CPI) శ్రేణులు తరలి వచ్చాయి. నిరసన ప్రదర్శన ప్రారంభమైన కొద్దిసేపటికే పోలీసులు జోక్యం చేసుకొని ర్యాలీని అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొన్న మంత్రులు, పలువురు నేతలను అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ (Panjagutta Police Station) కు తరలించారు.








