అందుకే బీజేపీకి రాజీనామా : భిక్షమయ్య గౌడ్
ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. తెలంగాణ పట్ల బీజేపీ వివక్ష చూపుతోంది. బీజేపీ చేస్తున్న వివక్ష, అన్యాయాన్ని చూసి రాజీనామా చేస్తున్నా. ఇంకా బీజేపీలో కొనసాగితే అర్థం లేదు. తెలంగాణకు బీజేపీ అంగా ఉంటుందన్న హామీతో పార్టీలో చేరా. బీజేపీ చేరినప్పటి నుంచి అడుగడుగునా అవమానాలే. బీజేపీలో బీసీ నేతను పట్టించుకునేవాళ్లే లేరు అన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులందరూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటున్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అనడమే తప్ప ఒక్క పైసా అదనంగా ఇవ్వట్లేదు. రాష్ట్ర నాయకత్వంపై బీజేపీ అధిష్టానికి ఏమాత్రం పట్టులేదు. శాంతి వాతావరణం చెడగొట్టేలా నేతలు మాట్లాడుతున్నారు. యాదాద్రి ఆలయానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మిషన్ భగీరథకూ నిధులు ఇవ్వలేదు. ఫ్లోరైడ్ బాధితుల కోసం 300 పడకల ఆస్పత్రి హామీకి అతీగతీ లేదు అని బిక్షమయ్య గౌడ్ పేర్కొన్నారు.













