ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్ష
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. బీఫ్ ఫెస్టివల్ వివాదంలో రాజాసింగ్‌పై ఐదేళ్ల క్రితం కేసు నమోదైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల క్రితం తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకునేందుకు రాజాసింగ్ యత్నించారు. ఈ క్రమంలో పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించారనే అభియోగాలపై రాజాసింగ్‌పై బొల్లారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిలో భాగంగా విచారణ చేపట్టిన నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.













