అధిష్ఠానం ఆదేశిస్తే… సీఎం కేసీఆర్ పై పోటీకి సై
అధిష్ఠానం ఆదేశిస్తే సీఎం కేసీఆర్పై పోటీ చేసి ఓడిస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పల్లె గోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఆయన దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు ఓటమి ఖాయమని అన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా విశ్వాసం కోల్పోయారన్నారు. ఎమ్మెల్యేలు ఏ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరినా ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో రిపీటవుతుందన్నారు. కేసీఆర్ దుర్మార్గాలు, అబద్దాలు, మాయమాటలను తెలంగాణ సమాజం నమ్మడానికి సిద్ధంగా లేదని అన్నారు.













