ఎంఐఎంతో టీఆర్ఎస్కు ఉన్న ఒప్పందమేంటి?
తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఎంఐఎం పార్టీతో టీఆర్ఎస్కు ఉన్న రహస్య ఒప్పందమేంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర ఆరే మైసమ్మ క్రాస్ రోడ్స్ కు చేరుకుంది. ఈ సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఒక్క కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లి ఘోషిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కోకాపేటలో దళితుల భూములను విక్రయించడాన్ని బీజేపీ ఖండిస్తోందన్నారు. తెలంగాణ సమాజ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టుపెట్టారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుని ప్రజలకు అప్పగిస్తామన్నారు. భూములను ఆక్రమించుకుని కొందరు నిజాం ఆస్తులుగా ప్రచారం చేశారన్నారు.













