ఈ నెల 12 నుంచి భక్తి టీవీ కోటీ దీపోత్సవం
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 12 నుంచి 22వ తేదీ వరకు రచన టెలివిజన్, ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భక్తి టీవీ కోటీ దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రతిరోజు 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ అధ్యాత్మిక వేడుకలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ, త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి, విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర, ఉడుపి పెజావర్ పీఠాధిపతి శ్రీవిశ్వప్రసన్నతీర్థ వంటి ప్రసిద్ధ గురువు లతో పాటు చాగంటి కోటేశ్వర్రావు, సామవేదం షణ్ముఖశర్మ, గరికపాటి నరసింహారావులాంటి విఖ్యాత ప్రకచనకర్తలు పాల్గొంటారన్నారు.













