రాబోయే రోజుల్లో ప్రగతి భవన్ నుంచి.. గాంధీభవన్‌కు
సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం సరికాదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్జికల్ స్ట్రైక్స్‌పై సైన్యాన్ని, ప్రధాని మాటలను కేసీఆర్ నమ్మడం లేదని, మరి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజహర్ చెబితే నమ్ముతారా అని ప్రశ్నించారు. సైన్యాన్ని అనుమానిస్తోన్న కేసీఆర్ ఏ దేశానికి మద్దతు పలుకుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడిన కేసీఆర్ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కేసీఆర్ ఈ మధ్య టెన్ జన్‌పథ్ స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారని రాబోయే రోజుల్లో ప్రగతి భవన్ నుంచి గాంధీభవన్‌కు మారబోతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం పేరు చెప్పి మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ మీటర్ల సమస్య దేశవ్యాప్తంగా ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రైతులను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ఆరోపించారు.













