ఎన్నికలయ్యేంత వరకు బండి సంజయే
బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవిపై మీడియా లీకేజీలు సరికాదని, బీజేపీలో వార్తలు లీక్ చేసే పద్ధతి ఉండదని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు బండి సంజయ్‌నే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతారని పార్టీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్ చెప్పిన మాట ఇప్పటికీ అధికార పూర్వక ప్రకటన అని స్పష్టం చేశారు. నేతలు భేటీలపై ఊహాగానాలతో వెలువడే కథనాలు, సమాచారం ఎప్పటికీ అధికార ప్రకటనలు కాబోవన్నారు. పార్టీ అధికార ప్రతినిధులు నుంచి మాత్రమే ఖచ్చితమైన సమాచారం, లేదా ప్రకటన వస్తుందన్నారు.













