రాజకీయ కక్షతో విద్యార్థి భవిష్యత్తు నాశనం : బండి సంజయ్
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్లో చక్కర్లు కొట్టిన ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిదే. ఈ ఘటన పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి స్పందించారు. ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనలో కమలాపూర్ ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థిని అయిదేళ్ల పాటు డిబార్ చేసినట్టు సోషల్ మీడియాలో చూశా. అన్ని పరీక్షలు బాగా రాసి, మంచిగా చదువుకునే విద్యార్థిని డిబార్ చేయడం దారుణం. బెదిరించి తన వద్ద పేపర్ లాక్కున్నారని బాలుడు చెబుతున్నాడు. అలాంటప్పుడు పరీక్షా కేంద్రం వద్ద కాపలాగా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు? స్క్వాడ్లు ఏమయ్యాయి? రాజకీయ కక్షతో విద్యార్థి భవిష్యత్తు నాశనం చేయడం తగదు. వెంటనే విద్యార్థితో పరీక్షలు రాయించి, అతని చదువు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.













