నాణేనికి బొమ్మాబొరుసులు… ఆ రెండు పార్టీలు
తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకే నాణేనికి ఉన్న బొమ్మాబొరుసులాంటివని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ రెండు పార్టీలు సెంటిమెంట్ రగిలిస్తున్నాయన్నారు. ఒకరి స్వార్థం కోసం మరొకరు వ్యవహరిస్తున్నారని, స్వార్థం కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. విశాఖ ఉక్కు కొనే డబ్బుంటే రాష్ట్రంలో బయ్యారం ఫ్యాక్టరీ, నిజాం షుగర్స్ తెరవొచ్చు కదా అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.













