టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ గూటికి టీఆర్ఎస్ మేయర్
హైదరాబాద్‌ను కీలక నగరంగా కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బడంగ్‌పేట మేయర్ పారిజాత, పలువురు టీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఢిల్లీ లో రాహుల్ గాంధీ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామంటున్న టీఆర్ఎస్ నేతలు, కనీసం రోడ్లపై పడ్డ గుంతలు పూడ్చటం లేదని మండిపడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్, డీజిల్, పెట్రోల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు అడ్డగోలుగా పెంచారు. సామాన్య ప్రజలకు బతకడమే భారంగా మారింది. దేశ సరిహద్దుల్లో రక్షణ లేకుండా పోయిందన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది. అభివృద్ధి కుంటుపడటమే కాకుండా రాష్ట్రం దివాల తీసే పరిస్థితికి చేరింది. ఈ అంశాలన్నింటిపైనా రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తూ ప్రజలకు అండగా ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు. తెలంగాణను ఇచ్చిన పార్టీగా, రాష్ట్రాన్ని కాపాడుకునే బాద్యతను కూడా మాపై ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు.













